మురళీధర్‌రావుపై హైకోర్టులో పిటిషన్‌

15 Jul, 2019 13:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మురళీధర్‌రావు, ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ప్రవర్ణరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనకు కేంద్రంలో నామినేటెడ్‌ పోస్టు ఇస్తామని మురళీధర్‌రావు పీఏ కిషోర్‌, కారా చైర్మన్‌ మందా రామచంద్రారెడ్డి రూ. 3 కోట్లు తీసుకున్నారని పిటిషనర్‌ ఆరోపించారు. ఆ తర్వాత నామినేటెడ్‌ పోస్టు ఇవ్వకుండా మోసం చేశారని తెలిపారు. దీనిపై తాను సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని.. నాలుగు నెలలు గడుస్తున్నా పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేయలేదని కోర్టుకు తెలిపారు.

ప్రవర్ణరెడ్డి పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. కేసు దర్యాప్తులో ఎందకు జాప్యం వహించారని పోలీసులను ప్రశ్నించింది. అయితే నాలుగు వారాల్లోగా నిందితులపై చార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు