డీలర్లను తొలగించేందుకు కుట్ర

2 Jul, 2018 10:53 IST|Sakshi
 టేక్మాల్‌లో మాట్లాడుతున్న ముక్తార్‌

టేక్మాల్‌(మెదక్‌): రేషన్‌ డీలర్లను తొలగించేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని టేక్మాల్‌ జెడ్పీటీసీ ఎం.ఏ. ముక్తార్‌ ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రమైన టేక్మాల్‌లో విలేకరులతో మాట్లాడారు. 40 ఎళ్లుగా డీలర్లుగా సేవలందిస్తున్న వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.  డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేసి వారికి మానసిక క్షభను మిగిల్పిందని ధ్వజమెత్తారు. ఇక డీలర్లకు రూ.400 కోట్లకు పైగా బకాయి చెల్లించకుండా వారిని తొలగిస్తామనడం సరికాదన్నారు.

న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తుంటే వారిపై వేటు వేస్తామనడం సరైన విధానం కాదని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం నియోజకవర్గంలోనే డీలర్‌ ఆత్మహ్యతకు యత్నించినా స్పందించికపోవడంతో దారుణమన్నారు. డీలర్ల సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని, ప్రభుత్వం స్పందించకుంటే పార్టీ తరపున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సాయిలు, నాయకులు యాదయ్య, జేఏసీ జిల్లా నాయకులు మల్లయ్య, అన్వర్‌పాషా, శంకర్‌  తదితరులు ఉన్నారు.
 
పెద్దశంకరంపేట(మెదక్‌): రేషన్‌డీలర్ల సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలుపుతున్నట్లు టీపీసీసీ సభ్యులు, ఖేడ్‌ ఎంపీపీ పట్లోళ్ల సంజీవర్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం పేటలో సమ్మె చేస్తున్న డీలర్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లకు రూ.415 కోట్ల కమీషన్‌ బకాయిలు చెల్లించడం లేదని, వారి వేతనాన్ని రూ.30 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమలో అన్ని వర్గాలుపాల్గొన్నాయని, వారిలో డీలర్లకు కూడా ఉన్నారని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో వారి సమస్యలపై ఉద్యమిస్తుంటే దానికి అణచివేయాలని యత్నంచడం దుర్మార్గమన్నారు. సీఎం నియోజకవర్గంలోనే డీలర్‌ నజీర్‌ఖాన్‌ ఆత్మహత్యకు యత్నించడం బాధాకరమన్నారు.

ఇక కొత్త కార్డులు మంజూరు చేయకపోగా, అంత్యోదయకు బియ్యాన్ని తగ్గిస్తున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం పేదలకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ సీడీసీ డైరెక్టర్‌ కుంట్ల సంగయ్య, డీలర్ల సంఘం అ«ధ్యక్షుడు కిష్టయ్య, శివరాజ్, కుమార్, భాస్కర్, పండరి, వినోద్, కుచ్చకుమార్, ప్రతాప్‌గౌడ్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు