బస్సు ఢీకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

8 Jul, 2014 09:15 IST|Sakshi

ఆర్టీసీ బస్సు ఢీకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు.  మెదక్ జిల్లా రామచంద్రాపురానికి చెందిన గడీల ఆంజనేయులు కుమారుడు వరుణ్‌గౌడ్ (25) అవివాహితుడు.  ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ బాలానగర్‌లో ఉంటున్నాడు. తనకు శని, ఆదివారాలు సెలవులు కావడంతో స్నేహితులను కలుసుకున్నాడు. వాళ్లతో సరదాగా గడిపాడు.

తర్వాత విద్యానగర్ నుంచి వరుణ్‌గౌడ్ తన కారులో బయల్దేరాడు. ఓయూ ఇంజినీరింగ్ కళాశాల గంగా హాస్టల్ వద్దకు చేరుకోగానే వరుణ్‌ ఒక్కసారిగా  కారును కుడి వైపు తిప్పాడు.  అదే సమయంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి అఫ్జల్‌గంజ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఆ ప్రమాదంలో వరుణ్‌గౌడ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. పోలీసులు ప్రమాదానికి గురైన కారును, బస్సును స్టేషన్‌కు తరలించారు. బస్సు డైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.  కేసు నమోదు చేసి దరాప్తు చేస్తున్నారు

మరిన్ని వార్తలు