ఇప్పుడు జోక్యం చేసుకోలేం

3 Jan, 2019 03:42 IST|Sakshi

హైకోర్టు విభజన వాయిదా వేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్య

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈవిషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు అత్యున్నత న్యాయ స్థానం నిరాకరించింది. ఏపీ హైకోర్టులో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనందున ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు ప్రక్రియను వా యిదా వేయాలంటూ ఏపీ న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు సీతారాం, సభ్యుడు కాసాని జగన్మోహన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన బెంచ్‌ బుధవారం విచారించింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రవీణ్‌ చతుర్వేది వాదిస్తూ.. ఏపీ హైకోర్టు భవనాలు, మౌలిక వసతుల కల్పన డిసెంబర్‌ 15 నాటికి పూర్తి చేస్తామంటూ ఏపీ ప్రభుత్వం కోర్టులో తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసిందన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని చెప్పారు. ఈ క్రమంలో న్యాయమూర్తులు జోక్యం చేసుకొని.. ఉమ్మడి హైకోర్టు విభజన అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని, ఇప్పటికే రెండు రాష్ట్రాల హైకోర్టుల కార్యకలాపాలు ప్రారంభమైనందున తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. ఆరంభంలో చిన్నచిన్న సమస్యలు సాధారణంగానే ఉంటాయని వ్యాఖ్యానించి కేసును విచారించేందుకు తిరస్కరించారు. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్లు కోరగా కోర్టు అనుమతించింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాస్‌ పుస్తకం ఇవ్వడం లేదని టవర్‌ ఎక్కిన వ్యక్తి

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కృష్ణసాగర్‌ రావు

‘ఇంతవరకు రూ. 2 వేల పింఛను ఇవ్వలేదు’

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

మురళీధర్‌రావుపై హైకోర్టులో పిటిషన్‌

గుట్టు విప్పుతున్న ఈ–పాస్‌..! 

డొక్కు బస్సులే దిక్కు !

పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు

కథ కంచికేనా !

డెంగీ.. డేంజర్‌

ఇక ఇంటికే  ఈ– చలాన్‌ 

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

పేదరికం వెంటాడినా.. పట్టుదల నిలబెట్టింది

మొక్కుబడి గ్రామసభలకు చెక్‌ 

భాష లేనిది.. నవ్వించే నిధి

ఓడీఎఫ్‌ సాధ్యమేనా.?

గుట్టు విప్పుతున్న ఈ–పాస్‌..!

నా కొడుకును బతికించరూ..

చేయూతనందిస్తే సత్తా చాటుతా..!

ప్రతిజ్ఞాపకం ‘పార్టీ’ నే

మన ఇసుకకు డిమాండ్‌

పాతబస్తీలో పెరుగుతున్న వలస కూలీలు

శాతవాహన యూనివర్సిటీ ‘పట్టా’పండుగ 

వానాకాలం... బండి భద్రం!

దేవుడికే శఠగోపం

పంచాయతీలకు ‘కో ఆప్షన్‌’

ఆరోగ్యశాఖలో.. అందరూ ఇన్‌చార్జ్‌లే  

పోచంపల్లిలో హీరో నాగచైతన్య సందడి

జరిమానాలకూ జడవడం లేదు!

మేఘసందేశం = ఆగస్టు, సెప్టెంబర్‌లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...