బీదర్‌లో సుశీల్‌కుమార్‌ అంత్యక్రియలు

4 Mar, 2018 01:08 IST|Sakshi
సుశీల్‌కుమార్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

హాజరైన డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు

సాక్షి, హైదరాబాద్‌/న్యాల్‌కల్‌(జహీరాబాద్‌) : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో శుక్రవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన బీదర్‌వాసి, గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ బి.సుశీల్‌కుమార్‌ (33) అంత్యక్రియలు శనివారం బీదర్‌ పట్టణంలో నిర్వహించారు. భద్రాద్రి నుంచి ఆయన మృతదేహాన్ని శనివారం తెల్లవారుజామున ప్రత్యేక వాహనంలో బీదర్‌కు తీసుకొచ్చారు.

సుశీల్‌ మృతదేహం ఇంటికి రాగానే కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పట్టణంలోని నయాకమాన్, అఫ్జల్‌గంజ్‌ మీదుగా మంగల్‌పేట్‌లోని మె«థడిస్టు చర్చి వరకు అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం మంగల్‌పేట్‌లోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

నివాళులర్పించిన డీజీపీ
రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కర్ణాటకలోని బీదర్‌లో ఉన్న సుశీల్‌కుమార్‌ ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. అలాగే అంత్యక్రియలకు నిఘా విభాగం అధిపతి నవీన్‌చంద్, సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, బీదర్‌ కలెక్టర్‌ మహాదేవు, ఎస్పీ దేవరాజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు