ప్రియాంకరెడ్డి కుటుంబానికి పరామర్శ

30 Nov, 2019 19:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రియాంకరెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హామీయిచ్చారు. శనివారం ప్రియాంకరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను గవర్నర్‌ ఓదార్చారు. ప్రియాంకరెడ్డి తల్లి విజయమ్మ, చెల్లెలు భవ్యారెడ్డిలను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అన్నివిధాల అండగా ఉంటానని భరోసాయిచ్చారు. పోలీసుల వ్యహారశైలిపై గవర్నర్‌కు స్థానికులు ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు వెంటనే ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగా స్పందించలేదని, ఎఫ్‌ఐఆర్‌ అంటూ తాత్సారం చేశారని ఆరోపించారు. వారు చెప్పిన విషయాలను గవర్నర్‌ ఓపిగ్గా విన్నారు.

ఎటువంటి సహాయం కావాలన్నా తన దగ్గరకు నేరుగా రావొచ్చని ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులతో గవర్నర్‌ అన్నారు. ఫోన్‌లో అందుబాటులో ఉంటానని, ఏ సమయంలోనైనా తనకు కాల్‌ చేయమని సూచించారు. ధైర్యంగా ఉండాలని, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని భవ్యారెడ్డికి సూచించారు. కాగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పలువురు కాంగ్రెస్‌ నాయకులు, సినీ ప్రముఖులు కూడా ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

ప్రియాంక తల్లిదండ్రులు నాతో అదే చెప్పారు: అలీ

ప్రియాంక హత్య: కిషన్‌ రెడ్డి కీలక ప్రకటన

చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్తత

‘మాకు అప్పగించండి.. నరకం చూపిస్తాం’

మరిన్ని వార్తలు