భారత్‌పర్వ్‌లో ఆకట్టుకున్న ‘తెలంగాణ’ 

30 Jan, 2018 02:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఏర్పాటుచేసిన భారత్‌పర్వ్‌ లో తెలంగాణ సంస్కృతి, కళా రూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా విభిన్న కళలు, సంస్కృతులు, సంప్రదాయాలను ఒక్క చోటుకి చేర్చే లక్ష్యంతో కేంద్ర పర్యాటక శాఖ ఏటా 6 రోజుల పాటు భారత్‌పర్వ్‌ కార్యక్రమం నిర్వహిస్తుంది. తెలంగాణకు సంబంధించిన పేరిణీ శివతాండవం, ఒగ్గు రవి శిష్యబందం డోలు విన్యాసాలు, కళాకారుల సాంస్కతిక నత్యాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అశోక్‌కుమార్, ఏఆర్సీ వేదాంతం గిరి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు