లాక్‌డౌన్‌ కష్టకాలంలో రేషన్‌ ఆపేస్తారా? 

26 Jun, 2020 02:46 IST|Sakshi

నగదు సాయం ఎందుకు నిలిపివేశారో చెప్పాలి: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: మూడు నెలలు రేషన్‌ తీసుకోలేదని చెప్పి ఇప్పుడు రేషన్‌ సరుకులతోపా టు రూ.1,500 ఆర్థిక సాయాన్నీ నిలిపివేయడం సబబు కాదని హైకోర్టు అభిప్రాయపడింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించడం వల్ల వివిధ ప్రాంతాల్లోని వారంతా సొంతూళ్లకు వ చ్చారని, వారంతా వలసలో ఉన్నప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రేషన్‌ తీసు కుని ఉండరని, ఈ కోణంలో ప్రభుత్వం చూసి తెల్ల రేషన్‌ కార్డుదారులకు రూ.1,500 నగదు, రేష న్‌ ఇవ్వాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

లాక్‌డౌన్‌లో పనులు కూడా లేక చాలా మంది ఇబ్బందిపడుతున్న తరుణంలో వీటిని ఇవ్వకపోవడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. నోటీసు కూడా ఇవ్వకుండా రేషన్‌ కార్డుల్ని భారీగా ఏరివేయడంపై దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాలను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ జరిపింది. జంటనగరాల్లో 20.6 లక్షల రేషన్‌ కార్డులకుగాను 17.6 లక్షలను అధికారులు తిరస్కరించారని, రేషన్‌ కార్డు లేదని చాలామందికి లాక్‌డౌన్‌ నగదు సా యం ఇవ్వలేదని పిటిషనర్‌ న్యాయవాది చె ప్పారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తదు పరి విచారణ జూలై నెలకు వాయిదా పడింది.

మరిన్ని వార్తలు