కర్ణాటక ‘అడ్డుక ట్ట’ తొలగించండి

23 Mar, 2016 01:49 IST|Sakshi
కర్ణాటక ‘అడ్డుక ట్ట’ తొలగించండి

నీళ్లిచ్చి తాగునీటి కష్టాలు తీర్చండి
పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన
జేసీ హామీతో రాస్తారోకో విరమణ

 
మాగనూర్:  కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా వేస్తున్న నీటి అడ్డుకట్టలను తొలగించాలని.. తమ సాగు, తాగునీటి కష్టాలను తీర్చాలని డిమాండ్ చేస్తూ మండలంలో ని టైరోడ్‌లో మంగళవారం కృష్ణానది తీరప్రాంత రైతులు 3గంటల పాటు రా స్తారోకో నిర్వహించారు. కొందరు రైతు లు పురుగుమందు డబ్బాలను చేతపట్టుకొని నిరసన తెలిపారు. అడ్డుకట్టను తొలగించకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని కొందరు రైతులు తమ ఆవేదన వెళ్లగక్కారు. కర్ణాటక దౌర్జన్యంగా మన భూభాగంలోని నదినీటికి అడ్డుకట్టవేస్తున్నా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బంగారు తెలంగాణ అంటున్న కేసీ ఆర్‌కు తాము తాగునీటికి పడుతున్న సమస్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

నదితీర ప్రాంతంలోని ప్రజలు ఇంతటి దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటుండగా ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక తహశీల్దార్ కృష్ణస్వామి అక్కడిచేరుకుని ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసాఇచ్చారు. కానీ రైతులు సమ్మతించలేదు. చివరికి అక్కడినుంచే జేసీ రాంకిషన్‌కు తహశీల్దార్ సమస్యను ఫోన్‌లో వివరించారు. సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో నాయకులు సిద్రాంరెడ్డి, సంతోష్, వెంకటేష్, సూగిరెడ్డి, కృష్ణమూర్తి, కృష్ణ, నింగప్ప, గుండప్ప, తిమ్మప్ప, రవి, గణపతి, రాంబాబు, శివప్ప, శంక్రప్ప, బషీర్, వెంకటేష్, ఉషెనప్ప, రాకేష్, తిమ్మప్ప, ప్రతాప్ పాల్గొన్నారు.
 
 పరిశీలించిన డీఆర్‌ఓ, డీఎస్పీ
కృష్ణానదిలో నీటి ప్రవాహానికి అడ్డుకట్టవేసి ఆ నీటిని కేపీసీ పవర్‌ప్లాంట్‌కు కర్ణాటక తరలిస్తున్న ప్రాంతాన్ని డీఆర్‌ఓ బాస్కర్, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, జూరాల ప్రాజెక్టు ఈఈ శ్రీధర్ పరిశీలించారు. ఉదయం నదితీరప్రాంతాల రైతులు కర్ణాటక వేసి న అడ్డుకట్టలను తొలగించాలని డిమాం డ్ చేస్తూ టైరోడ్‌లో రాస్తారోకో చేసిన విషయాన్ని తహశీల్దార్ కృష్ణస్వామి అధికారులకు వివరించారు. ఈ విషయమై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుని, ఈ ప్రాంతరైతులకు న్యాయం చేస్తామన్నారు. వారివెంట సీఐ శ్రీనివాస్, ఆర్‌ఐ సురేష్, కృష్ణ ఎస్‌ఐ రియాజ్ ఆహ్మద్, మాగనూర్ ఎస్‌ఐ నర్సయ్య, పలువురు రైతులు ఉన్నారు.

మరిన్ని వార్తలు