కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

25 Sep, 2019 02:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాలుగైదు నెలలుగా కానిస్టేబుల్‌ అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తుది ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ) మంగళవారం రాత్రి 11 గంటలకు ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను  https://www. tslprb.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఇప్పటికే విడుదలైన రాతపరీక్షలో 90 వేలమంది అభ్యర్థులు అర్హత సాధించారు.

తాజాగా విడుదల చేసిన తుది ఫలితాల్లో సివిల్, ఏఆర్, టీఎస్‌ ఎస్పీ, ఫైర్, ప్రిజన్స్, డ్రైవర్స్‌ తదితర విభాగాల ఫలితాలకు కలిపి మొత్తంగా 17,156 మంది ఎంపికైనట్లు టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ చైర్మన్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. వీరిలో 13,373 మంది పురుషులు కాగా 2,652 మంది మహిళలున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఏమైనా అభ్యంతరాలుంటే.. ఈనెల 25 (నేడు) 4 గంటల నుంచి 7 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకు స్థానిక ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.1,000 ఇతరులు రూ.2,000 చెల్లించాల్సి ఉంటుం దన్నారు. మరిన్ని వివరాలకు https://www. tslprb.in/ వెబ్‌ సైట్‌ను సందర్శించాలని సూచించారు.  

ఎంపికైన అభ్యర్థులు..17,156 
పురుషులు.. 13,373
మహిళలు.. 2,652 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా