రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి 

1 May, 2020 02:25 IST|Sakshi
గురువారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కరోనా పరిస్థితులపై చర్చిస్తున్నఅఖిలపక్ష నేతలు

ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5000 ఇవ్వాలి

కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచాలి

సీఎస్‌కు అఖిలపక్ష నేతల పలు సూచనలు 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ సోకి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.1,500 సరిపోవట్లేదని, వారికి రూ.5 వేలు ఇవ్వాలని కోరారు. ఉత్తమ్‌ నేతృ త్వంలోని అఖిలపక్ష బృందం గురువారం స చివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలసి రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించింది. కోదండరాం (టీజేఎస్‌), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), ఎల్‌.రమణ (టీడీపీ), చెరుకు సుధాకర్‌ (తెలంగాణ ఇంటి పార్టీ)లు సీఎస్‌ను కలసి పలు సూచనలతో కూడిన వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మా ట్లాడారు. 40 రోజుల లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, అనివార్యమైన ఇబ్బందులను స్ఫూర్తితో ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

అఖిలపక్ష నేతలు ఎవరేమన్నారంటే 
రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పని చేయట్లేదు.  గాంధీ, ఉస్మానియాలో మిగతా ఆరోగ్య సేవలు పునరుద్ధరించాలి.’ –చెరుకు సుధాకర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు 
కొత్త రేషన్‌ కార్డులు దరఖాస్తు చేసిన వారికి కూడా రేషన్‌ బియ్యం ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేలు ఇవ్వాలి. సంగారెడ్డిలో నిరసన తెలిపిన కార్మికులకు జీతం ఇప్పించాలి. 
చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి 
‘రేషన్‌లో బియ్యంతో పాటు, పప్పు, నూనె ఇవ్వాలి. వాహనాల పన్నును 3 నెలల పాటు రద్దు చేయాలి. కోదండరామ్, టీజేఎస్‌ 
‘రైతు రుణమాఫీ చేయాలి. సూరత్, భివండి, ముంబైలలో ఉన్న వలస కార్మికులను సొంత రాష్ట్రానికి తీసుకురావాలి. – ఎల్‌.రమణ, టీటీడీపీ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు