పల్లె అందం చూద్దామా..

13 Dec, 2019 10:32 IST|Sakshi
తెల్లవారుజామున చెరువులో చేపల వేట

సాక్షి, నిజామాబాద్‌: పల్లె అంటేనే అందం.. పచ్చని పంట పొలాలు.. కల్మషం లేని మనుషులు.. పంట భూములు.. పైరగాలులు.. లేగెదూడల అంబా..అంబా అనే పిలుపులు.. పక్షుల రాగాలు.. బాగున్నావా బిడ్డా అంటూ ఆప్యాయంగా పలకరింపులు.. ఇలా అచ్చమైన సంప్రదాయాలకు నిలువుటద్దంలా పల్లెలు నిలుస్తాయి. మనిషి సాంకేతికతను పెంచుకుంటూ ఆధునిక జీవనానికి అలవాటు పడుతున్నప్పటికీ పల్లెల్లో ఇప్పటికీ ఒకే మాట.. ఒకే బాట.  ప్రేమపూర్వక పిలుపులు.. ఆప్యాయమైన ఆదరణ తగ్గలేదు. ఇప్పటికీ పల్లె సంప్రదాయాలు మారలేదు.. వారి పద్ధతులూ మారలేదు. అందుకే పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు. ఈ సందర్భంగా పచ్చని పల్లెలో గ్రామీణుల దినచర్య దృశ్యమాలిక రూపంలో..
– సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్‌.. 

మరిన్ని వార్తలు