ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లు ఉపసంహరించుకోవాలి

29 Mar, 2018 06:28 IST|Sakshi
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న  విద్యార్థి సంఘాల నాయకులు

విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్‌

ఎదులాపురం(ఆదిలాబాద్‌) : ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యం లో బుధవారం ఆందోళన చేపట్టారు.  స్థానిక బస్టాండ్‌ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సం దర్భంగా నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం ఓ వైపు కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామంటూనే మరో వైపు విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందన్నా రు. యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా.. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు విచ్చిలవిడిగా అనుమతులిస్తోందని విమర్శించారు. ఫలితంగా ప్రభుత్వ విద్యాసంస్థలు మూతపడే పరిస్థి తి ఏర్పడుతోందన్నారు. కార్యక్రమంలో టీఏవీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోట్నాక రాహుల్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆత్రం నగేశ్, కన్వీనర్‌ సుప్రియ, టీవీవీ జిల్లా అధ్యక్షుడు బి.రాహుల్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పి.కళావతి, టీఏవీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అన్నమెల్ల కిరణ్, టీవీవీ, పీడీఎస్‌యూ నాయకులు శివ, అజయ్, తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు