టూత్ పేస్ట్ బాంబులతో జాగ్రత్త: అమెరికా

6 Feb, 2014 19:05 IST|Sakshi

వాషింగ్టన్: సోచి వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా టైస్టులు టూత్‌పేస్ట్, కాస్మెటిక్స్ ట్యూబ్స్‌లో పేలుడు పదార్థాలు దాచే అవకాశం ఉందని విదేశీ, స్వదేశీ విమానయాన సంస్థలను అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు దేశీయ భద్రతా శాఖ బులెటిన్ విడుదల చేసిందని అమెరికా ప్రతినిధుల సభ దేశీయ భద్రతా కమిటీ చైర్మన్ మెక్‌కాల్ తెలిపారు. అలాంటి పేలుడు పదార్థాలతో విమానాల్లో విధ్వంసం సష్టించడానికిగానీ, శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే వింటర్ ఒలింపిక్స్‌లో వాడడానికిగానీ స్మగ్లింగ్ చేసే అవకాశం ఉందని ఆ బులెటిన్ హెచ్చరించింది.

 

అయితే వాటి వల్ల అమెరికాకు వచ్చే ముప్పేమీ ఉండదని మరో అధికారి వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు హెచ్చరిక జారీ చేశారని తెలిపారు. మరోపక్క ఈ క్రీడలు సందర్భంగా విమానాల్లో ద్రవ పదర్థాల రవాణాను రష్యా నిషేధించింది.
 

మరిన్ని వార్తలు