'ఎయిర్‌టికెట్లకు రీఫండ్‌ ఇస్తాం'

30 Jan, 2017 23:32 IST|Sakshi
'ఎయిర్‌టికెట్లకు రీఫండ్‌ ఇస్తాం'
ట్రంప్‌ ప్రభుత్వం నిషేధించిన ఏడు ముస్లిం దేశాల నుంచి బుక్‌ చేసుకున్న ఎయిర్‌టికెట్లకు రీ ఫండ్‌ ఇస్తున్నట్లు యూ.ఎస్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. నిషేధం విధించిన ఇరాన్‌, ఇరాక్‌, లిబ్యా, సోమాలియా, సూడాన్‌, సిరియా, యెమెన్‌ దేశాల్లోని గ్రీన్‌ కార్డు హోల్డర్లను మినహా ఎవరినీ అనుమతించబోమని అమెరికాకు చెందిన యూనైటైడ్‌ ఎయిర్‌లైన్స్‌, డెల్టా ఎయిర్‌లైన్స్‌ లు పేర్కొన్నాయి. 
 
90 రోజుల పాటు ఏడు ముస్లిం దేశాలపై గత శుక్రవారం ట్రంప్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌ సంస్ధ అయిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ తమ కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని చెప్పింది. టికెట్లను రీ బుక్‌ చేసుకునే సదుపాయం లేదా డబ్బును వెనక్కు ఇచ్చేందుకు సి​ద్ధమని తెలిపింది. 
 
యూనైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌(యూఏఎల్‌) సీఈవో ఆస్కార్‌ మునోజ్‌ మాట్లాడుతూ నిషేధం తర్వాత బుక్‌ చేసుకున్న టికెట్లకు రీ ఫండ్‌ ఇస్తామని చెప్పారు. బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌, ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ లు కూడా అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ బాటలో నడవనున్నట్లు చెప్పాయి. అయితే, ఎయిర్‌ఫ్రాన్స్‌ మాత్రం పెనాల్టీలను దృష్టిలో ఉంచుకని రీ ఫండ్‌ ఇస్తామని చెప్పింది. జర్మనీకి చెందిన ఎయిర్‌లైన్‌ దిగ్గజం లుఫ్తాన్సా కస్టమర్లకు రీ బుకింగ్‌ చేసుకునే సదుపాయన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది.
మరిన్ని వార్తలు