నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

15 Nov, 2016 10:14 IST|Sakshi

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో  ట్రేడ్ అవుతున్నాయి.   ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 300 పాయింట్లకుపైగా పతనమై, కొద్దిగా  కోలుకున్నా మళ్లీ పతనం దిశగా తిరిగింది. ప్రస్తుతం  332 పాయింట్ల నష్టంతో 26,486 వద్ద,  నిఫ్టీ దా121 పాయింట్ల నష్టంతో 8175  వద్ద ట్రేడవుతోంది.  ఆటో, రియల్టీ , ఐటీ నష్టపోతుండగా,   పీఎస్‌యూ బ్యాంకు లాభాల్లో ఉంది. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్‌ కూడా నష్టాల్లోనే ఉంది.  టాటా మోటార్స్‌  జీ, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, గ్రాసిమ్‌, ఏషియన్‌ పెయింట్స్, టాటా స్టీల్‌, ఎంఅండ్ఎం, టాటా పవర్‌  నష్టాల్లోనూ,   ఓఎనీజీసీ, అంబుజా, అరబిందో, గెయిల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా, హిందాల్కో లాభాల్లోనూ కదులుతున్నాయి.


అటు డాలర్ భారీగా పుంజు కోవడంతో రూపాయి మరింత పతనమైంది. 47 పైసల నష్టంతో 67.71 వద్ద   బలహీనంగా ఉంది.
 

మరిన్ని వార్తలు