కేంద్రమంత్రిపై రాళ్లతో దాడి, గాయాలు

19 Oct, 2016 19:43 IST|Sakshi
కేంద్రమంత్రిపై రాళ్లతో దాడి, గాయాలు

కోల్కతా: ప్రముఖ నటుడు, గాయకుడు, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కాన్వాయ్పై తృణమాల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సుప్రియోతో పాటు ఆయన అనుచరులు ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఓ రాయి తన ఛాతీపై పడిందని, గాయమైందని మంత్రి చెప్పారు. బుధవారం పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పశ్చిమబెంగాల్ న్యాయశాఖ మంత్రి మలోయ్ ఘటక్ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారని సుప్రియో ఆరోపించారు. ఆందోళనకారులు దాడి చేస్తున్నా పోలీసులు ఆపే ప్రయత్నం చేయలేదని చెప్పారు. నిరసనకారుల గుంపులోంచి ఓ పెద్ద రాయి విసిరారని సుప్రియో తెలిపారు. కొందరు ఈ ఘటనను వీడియో తీశారని పేర్కొన్నారు. ఆందోళనకారులు మంత్రి కారును ధ్వంసం చేశారు. అక్రమంగా కబేళాలను నడుపుతున్నారని, పరిశీలించేందుకు వెళ్లగా దాడిచేసినట్టు తెలిపారు. సుప్రియో అసన్సోల్ నియోజకవర్గం నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు