'డోంట్ టచ్ మీ' అంటే బూతు మాటా?

3 Sep, 2015 12:27 IST|Sakshi
'డోంట్ టచ్ మీ' అంటే బూతు మాటా?

హైదరాబాద్ : 'డోంట్ టచ్ మీ' అంటే బూతు మాటా? అలా అన్నందుకే కేసులు బుక్ అవుతున్నాయి. అదృష్టవశాత్తు నా మీద కేసు నమోదు అవలేదు. డోంట్ టచ్ మీ అంటే బూతు మాటా... అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. గురువారం అసెంబ్లీలో  జీరో అవర్లో... డోంట్ టచ్ మీ అంశాన్ని ఆయన లేవనెత్తారు.

ఇటీవల తాను తిరుపతి వెళ్లానని, అక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో క్యూలో నిలబడ్డానని, అయితే కొందరు తనను నెట్టివేసే ప్రయత్నం చేయగా డోంట్ టచ్ మీ అన్నానని.. ఆ విషయంలో వివాదం ఏర్పడిందన్నారు. అదేమైనా అసభ్యకరమైన పదమా, దుర్భాషలా అని ప్రశ్నించారు. అయితే బై లక్... తనపై కేసు నమోదు అవలేదని ఆయన తెలిపారు.

విష్ణు కుమార్ రాజు ప్రశ్నకు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సమాధానం ఇస్తూ... డోంట్ టచ్ మీ...(నన్ను ముట్టుకోవద్దు) అనేది అసభ్యకరమైన పదం కాదని, ఆ సంఘటన వివరాలు తెలుసుకుని అందుకు సంబంధించి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. కాగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా... డోంట్ టచ్ మీ అన్నందుకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు