మనవడి కోసం ఖరీదైన కారు

22 Feb, 2014 03:13 IST|Sakshi
మనవడి కోసం ఖరీదైన కారు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ బ్రాండెడ్ కారుగా పేరుగాంచిన లంబోర్గిని కారులో చక్కర్లు కొట్టాలనేది ఈ బుడతడి కోరిక. చైనాలోని జెంజూ ప్రావిన్స్‌లో వ్యవసాయం చేసుకునే ఈ తాతకు ఆ స్థాయి కారును కొనేంత స్తోమత లేదుగానీ... మనవడిని అచ్చం అలాంటి కారులోనే ఊరంతా తిప్పాలనే కోరిక మాత్రం బలంగా ఉంది. ఆరు నెలలు శ్రమించి అక్కరకురాని ఇనుపసామాను, ఎలక్ట్రిక్ సైకిల్ భాగాలతో కారును తయారుచేసి చివరికిలా మనవడి కోరికను తీర్చాడు. ఇందుకోసం చైనాకు చెందిన ఈ తాతయ్య దాదాపు రూ.51,000 మొత్తాన్ని ఖర్చుపెట్టాడు. బ్యాటరీతో నడిచే ఈ కారును పూర్తిగా చార్జింగ్ చేస్తే ఏకంగా 60 కి.మీ.లు నడుస్తుంది.

మరిన్ని వార్తలు