ఆ నాలుగు ఉల్లంఘనలే భారత్‌లో అత్యధికం

5 Mar, 2017 17:29 IST|Sakshi
ఆ నాలుగు ఉల్లంఘనలే భారత్‌లో అత్యధికం

వాషింగ్టన్‌: విదేశీ నిధులు పొందే ఎన్జీవోలపై నిషేధం, మత స్వేచ్ఛ, అవినీతి, పోలీసు, భద్రతా దళాల వేధింపులే భారత్‌లో ముఖ్యమైన మానవహక్కుల ఉల్లంఘనలని అమెరికా ప్రభుత్వ నివేదిక ఒకటి స్పష్టం చేస్తోంది. అదృశ్యమైపోవడం, ఘోరమైన జైళ్లు, న్యాయ విచారణలో విపరీతమైన జాప్యం వంటి హక్కుల ఉల్లంఘనలు భారత్‌లో ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

దేశంలో మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా 6 రాష్ట్రాల్లో మత మార్పిళ్లపై నిషేధం విధించారని ఈ నివేదిక తెలిపింది. దివ్యాంగులు, ఆదివాసీల పట్ల దేశంలో తీవ్రవివక్ష ఉందని తన నివేదికలో తెలిపింది. మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీలపై జరిగే నేరాలపై ప్రభుత్వ స్పందన నామమాత్రంగానే ఉందని పేర్కొంది. చిన్నారులపై అఘాయిత్యాలు, బాల్యవివాహాలు, పిల్లల అక్రమరవాణా భారత్‌ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలని తేల్చింది. ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో అలసత్వం, బాధ్యతారాహిత్యం విలయతాండవం చేస్తున్నాయని తెలిపింది.

మరిన్ని వార్తలు