మూడో రోజూ ఊగిసలాటలోనే మార్కెట్లు

18 Nov, 2016 10:32 IST|Sakshi

ముంబై:  దేశీ స్టాక్‌ మార్కెట్లు  నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.  ఈ రోజు(శుక్రవారం) కూడా  ఒడిదుడుకులకు లోనవుతూ  లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. సెన్సెక్స్45 పాయింట్లు క్షీణించి 26,182వద్ద, నిఫ్టీ13 పాయింట్లు క్షీణించి 8,066 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటం, ఎఫ్‌ఐఐల అమ్మకాలు,  ఫెడ్  వడ్డీ పెంపు అంచనాలు వంటి అంశాలు దేశీయంగా సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు నిపుణులు  అంచనావేస్తున్నారు. ఫార్మా, మీడియా, ఎఫ్‌ఎంసీజీ  స్వల్ప నష్టాల్లో, ఐటీ, రియల్టీ  స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.  ఎన్‌టీపీసీ, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ, అరబిందో  గ్రీన్ లో, డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా మోటార్స్, ఇన్ఫ్రాటెల్‌, గ్రాసిమ్‌, సన్‌ ఫార్మా   షేర్లు రెడ్ లోనూ ట్రేడవుతున్నాయి.
అటు రూపాయి మరింత బలహీనపడి రూ.68  దిగువకు చేరింది. 25  పైసల నష్టంతో కనిష్టస్థాయిలను నమోదు చేస్తోంది.  ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి కూడా నేల చూపులు చూస్తోంది.180 రూపాయల నష్టంతో 29  వేల దిగువకు చేరింది. పదిగ్రా. 28,951 వద్ద ఉంది.
 

మరిన్ని వార్తలు