డ్రైవర్ లేని బస్సు వచ్చేసింది..

8 Sep, 2015 18:48 IST|Sakshi
డ్రైవర్ లేని బస్సు వచ్చేసింది..

బీజింగ్: డ్రైవర్లేని బస్సు వచ్చేసింది. చైనాలో ఈ బస్సును విజయవంతంగా పరీక్షించారు. గత ఆగస్టులో హెనాన్ ప్రావిన్స్లోని  జెంగ్ఝౌ సిటీ-కైఫెంగ్ సింటీ ఇంటర్ సిటీ రోడ్డులో 32.6 కిలో మీటర్లు దూరం మేర సురక్షితంగా ప్రయాణించింది.

యుటాంగ్ బస్ కంపెనీ లిమిటెడ్ రూపొందించిన ఈ డ్రైవర్ రహిత బస్సు అన్ని పరీక్షల్లో విజయవంతమైంది. ఇంటర్ సిటీ రోడ్డుపై ఆటోమేటిక్గా లేన్స్ మార్చుకోవడం.. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగడం.. వాహనాలను ఓవర్టేక్ చేయడం వంటి పరీక్షలను పూర్తి చేసింది. బస్సులో రెండు కెమెరాలు, నాలుగు లేజర్ రాడార్లు, మిల్లీమీటర్ వేవ్ రాడార్ సెట్, నావిగేషన్ సిస్టమ్ను అమర్చారు. వీటి సాయంతో బస్సు నడుస్తుంది. యుటాంగ్ కంపెనీ మూడేళ్ల క్రితం డ్రైవర్ రహిత బస్సును తయారు చేయడానికి పరిశోధనలు మొదలుపెట్టింది. ఈ బస్సును వాడుకలో తీసుకురావాలంటే సాంకేతికను మరింత అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ మద్దతు అవసరమని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.
 

మరిన్ని వార్తలు