అండమాన్, పపువా న్యూగినియాల్లో భూకంపాలు

1 May, 2015 16:22 IST|Sakshi

అండమాన్ నికోబార్ దీవుల్లోను, పపువా న్యూగినియాలోను శుక్రవారం భూకంపాలు వచ్చాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు కాగా, పపువా న్యూగినియాలో 7.1 తీవ్రతతో వచ్చింది. పోర్ట్బ్లెయిర్కు 135 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో అండమాన్ భూకంప కేంద్రం ఉందని తెలిసింది. మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ఈ భూకంపం వచ్చినట్లు భారత వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. భూమికి 10 కిలోమీటర్ల లోతున ఇది వచ్చినట్లు తెలిపారు. అయితే, దీనివల్ల ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించినట్లు మాత్రం సమాచారం లేదు.

ఇక పపువా న్యూగినియాలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. కొకోపో నగరానికి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో దీని కేంద్రం ఉంది. ఇదే ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే దీనివల్ల సునామీ ముప్పు మాత్రం ఏమీ లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అలాగే ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా ఏమీ లేవు.

మరిన్ని వార్తలు