ఆలస్యంగా నడుస్తున్న 81 రైళ్లు

3 Dec, 2016 11:33 IST|Sakshi
ఆలస్యంగా నడుస్తున్న 81 రైళ్లు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంది. పొగమంచు, వెలుతురులేమి కారణంగా రవాణ వ్యవస్థ స్తంభించిపోయింది. శనివారం ఉదయం విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తొమ్మిది అంతర్జాతీయ విమాన సర్వీసులు, నాలుగు దేశీయ విమానాలు ఆలస్యమయ్యాయి. ఢిల్లీ-లక్నో విమానాన్ని రద్దు చేశారు. గత మూడు రోజులుగా పొగమంచు కారణంగా 200 పైగా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి.

ఇక ఈ రోజు ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన 81 రైళ్లు ఆలస్యమయ్యాయి. కొన్ని రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. 40 రైళ్ల ప్రయాణ వేళలను మార్పు చేశారు. మరో 13 రైళ్లను రద్దు చేశారు.

మరిన్ని వార్తలు