సెంట్రల్, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీలకు కౌన్సిల్‌ ఆమోదం

4 Mar, 2017 16:35 IST|Sakshi
సెంట్రల్, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీలకు కౌన్సిల్‌ ఆమోదం

ముంబై: కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)  అమలులో మరో కీలక అంకం ముగిసింది.  జీఎస్‌టీ  కౌన్సిల్‌ 11వ కీలకమైన  చట్టాలను ఆమోదించింది.    కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఈ కౌన్సిల్‌   శనివారం ముంబై నిర్వహించిన  ఉమ్మడి నియంత్రణపై జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశలో చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి.

ముఖ్యంగా  సెంట్రల్ జీఎస్‌టీ,  ఇంటిగ్రేటెడ్ జిఎస్టి చట్టాలకు ఆమోదం లభించింది.  ఈ చట్టాలకు సంబంధించి తుది ఆమోదాన్ని తదుపరి సమావేశంలో సాధించనున్నామని  పశ్చిమ బెంగాల్‌  ఆర్థిక మంత్రి అమిత్‌ మిత్రా తెలిపారు. జీఎస్‌టీ అమలుకు  ఇది గొప్ప ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రాల సాధికారతకు కేంద్రం అంగీకారం తెలపడంతో చిన్న వ్యాపారాలకు  భారీ ఊతం లభించింది. పన్ను పరిధులకు సంబంధించిన ఫిట్‌మెంట్‌ అంశాలపై  తదుపరి సమావేశంలో  కౌన్సిల్‌ నిర‍్ణయం తీసుకుంటుంది.

దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమలుకు సంబంధించి  పశ్చిమ బెంగాల్‌ సహా ఇతర  రాష్ట్రాలు  లేవనెత్తిన  26 పాయింట్లకు  కేంద్రం ప్రభుత్వం  అంగీకరించింది. నాలుగు అంచెల పన్నుల విధానాన్ని ఆమోదం లభించింది.  అలాగే   కనీస  పన్నురేటు 5 శాతంగా మధ్యస్థంగా 12-18శాతంగాను, అత్యధికంగా 28శాతంగా ఉండనున్నాయి.దీంతో ఇప్పటికే పరోక్ష పన్ను సంస్కరణలపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనున్న భిన్నాభిప్రాయాలన్నీ పరిష్కారమైన నేపథ్యంలో వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) జులైనుంచి అమలు మరింత ఖాయమైంది.  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల  పన్ను  శాఖ ఉద్యోగులకు  సమాన అధికారులు ఉండనున్నాయి.  వీటిని త్వరలోనే పార్లమెంటు ఆమోదంకోసం ఉంచుతుంది.   కౌన్సిల్‌ తదుపరి సమావేశం మార్చి 16 జరగనుంది. ఈ  సమావేశంలో మిగిలిన పెండింగ్‌ సమస్యలపై  చర్చించనున్నారు.  కొత్త పరోక్ష పన్నుల  చట్టం కింద రూ. 50 లక్షల లోపు వార్షిక టర్నోవర్  కలిగిన హోటల్స్ కనీస పన్ను స్లాబ్  5 శాతంగా  ఉంటుంది.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ప్రాతిపదికన   ఉంటుంది.

 కాగా  ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి   దీన్ని అమలు చేయాలని కేంద్రం యోచించినప్పటికీ   పన్ను అధికారాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కుదరక పోవడంతో  జులై 1కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.  

 

మరిన్ని వార్తలు