జీఎస్టీపై ఐఎంఎఫ్ పొగడ్తలు

7 Oct, 2016 14:59 IST|Sakshi
జీఎస్టీపై ఐఎంఎఫ్ పొగడ్తలు

వాషింగ్టన్: భారత ప్రభుత్వం అనుసరిస్తున్న సంస్కరణలను మరోసారి ప్రశంసించిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ( ఐఎంఎఫ్) ఇటీవల ఆమోదించిన జీఎస్టీ బిల్లుపై కూడా పొగడ్తలు  కురిపించింది.  వస్తు సేవల పన్ను అమలు దేశ  మధ్యంతర వృద్ధికి మరింత ప్రోత్సాహాన్ని స్తుందని తెలిపింది. 2016లో దేశం సాధించిన ఆర్థికవృద్ధిని స్వాగతించిన సంస్థ ఇది భవిష్యత్తులో కూడా కొనసాగాలని  పేర్కొంది.   తాజా ఆసియా పసిఫిక్ ప్రాంతీయ ఎకానమిక్ అప్ డేట్ లో ఈ వ్యాఖ్యలు చేసింది.
సంస్కరణల కారణంగా  రాబోయే రెండేళ్లలో  జీడీపీ వృద్ధి రేటు  7.6 శాతంగా ఉండనుందని అంచనా వేసింది.    కొనసాగుతున్న వృద్ధి పునరుద్ధరణ వ్యక్తిగత వినియోగం ద్వారా మరింత సులువవుతుందని తెలిపింది.   సాధారణ స్థాయిల్లో ఉన్న వర్షపాతం వ్యవసాయ వృద్ధికి  శుభ సంకేతమని,  ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా  దేశీయ డిమాండ్  కు ఊతమిస్తాయని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. వాణిజ్యంలో భారీ పెరుగుదల, నిర్మాణాత్మక సంస్కరణలు, సరఫరా వైపు అడ్డంకుల క్రమంగా తగ్గింపు, లాంటి  సానుకూల విధానపరమైన చర్యలు  పరంగా  అభివృద్ధి వృద్ధిలో ఉపయోగపడతాయని వెల్లడించింది.
ఉద్యోగాల సృష్టికి, ఆర్థిక వృద్ధికి గ్రేటర్  లేబర్  మార్కెట్  ప్లెక్సిబిలిటీ,  ఉత్పత్తి మార్కెట్ పోటీ  అవసరమని తెలిపింది. దీనికి  కొత్త కార్పొరేట్ రుణ పునర్నిర్మాణ విధానాల సమర్థవంతమైన అమలు కూడా ప్రభావితం  చేస్తుందని సూచించింది.  సంస్కరణల్లో పురోగతి ఇప్పటికే బలంగా ఉన్న విదేశీ పెట్టుబడుల వెల్లువను మరింత బలోపేతం చేస్తుందని  వ్యాఖ్యానించింది. భారతదేశం,  ఇండోనేషియా లోని  యువశక్తి  ( శ్రామిక వయసు జనాభా) వంటి  అంశాలు  ఆర్థిక వ్యవస్థల్లో పటిష్ఠమైన వృద్ధికి సమర్థవంతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది.
 

మరిన్ని వార్తలు