వినాయక నిమజ్జన ఊరేగింపులో ఘర్షణ, ఉద్రిక్తత

23 Sep, 2015 23:15 IST|Sakshi

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినాయక నిమజ్జన ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలు ఇనుపరాడ్లతో దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో నలుగురికి తీవ్రగాయాలయినట్టు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. జంగారెడ్డిగూడెంలో 144 సెక్షన్ విధించినట్టు పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు