మ్యాక్బుక్ ధర భారీగా పెంచిన ఆపిల్

1 Nov, 2016 10:02 IST|Sakshi
మ్యాక్బుక్ ధర భారీగా పెంచిన ఆపిల్
బ్రెగ్జిట్ కారణంతో తమ ఉత్పత్తుల ధరలను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించిన ఆపిల్, భారత్లోనూ మ్యాక్ బుక్ ధరలను పెద్ద ఎత్తున పెంచేసింది. మ్యాక్బుక్ ధరలపై ఏకంగా రూ.10వేలకు పెంచుతున్నట్టు ప్రకటించింది. గతవారమే ఈ ధరలు ఎగిసినప్పటికీ, ప్రస్తుతమే ఆపిల్ ఇండియా వెబ్సైట్లో ఈ కొత్త ధరలు ప్రతిబింబిస్తూ అప్డేట్ అయ్యాయి. దీంతో దేశీయంగా మ్యాక్బుక్ మరింత ఖరీదైనదిగా మారింది. రెండు మ్యాక్ బుక్ మోడల్స్ ధరలను భారీగా ఆపిల్ పెంచింది. వాటిలో ఒకటి 12 అంగుళాల మ్యాక్ బుక్ ధర రూ.6,000ల వరకు పెరిగి ప్రస్తుతం రూ.1,12,900ల నుంచి ప్రారంభమవుతోంది. ఫాస్టర్ ప్రాసెసర్, డబుల్ ఎస్ఎస్డీ స్టోరేజ్ కలిగిన మ్యాక్బుక్ వేరియంట్, రూ.10వేలు ఎగిసి, రూ.139,900గా నమోదవుతోంది.
 
రోజ్ గోల్డ్, స్పేస్ గ్రే, గోల్డ్, సిల్వర్ వేరియంట్లలో మ్యాక్బుక్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఆఫర్ చేసే వాటిల్లో మ్యాక్బుకే చిన్న పోర్టబుల్ ల్యాప్టాప్. ఆశ్చర్యకరవిషయమేమిటంటే మ్యాక్బుక్ ధరలను ఏకంగా రూ.10వేలు పెంచిన ఆపిల్, ఇతర మ్యాక్ డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటికే అంతర్జాతీయం ఆపిల్ ఉత్పత్తుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి.  కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్, స్థానిక దిగుమతి చట్టాలు, వ్యాపార పద్దతులు, పన్నులు, వ్యాపార ఖర్చులు వంటి ప్రభావంతో అంతర్జాతీయంగా ఆపిల్ ఉత్పత్తుల ధరలు పెంచినట్టు కంపెనీ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో చెప్పారు. అయితే అమెరికా రిటైల్ మార్కెట్లో మాత్రం ఆపిల్ ఉత్పత్తుల ధరలను ఎలాంటి మార్పులు చేయలేదు. 
మరిన్ని వార్తలు