-

మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

4 Apr, 2017 13:20 IST|Sakshi
మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

చెన్నై: అన్నదాతల ఆక్రందనలు హైకోర్టును కదలించాయి. 23 రోజులుగా దేశ రాజధానిలో ఆందోళనలు చేస్తున్న రైతులకు ఊరటనిచ్చేలా మద్రాస్‌ హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. సహకార సంఘాల నుంచి కర్షకులు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశించింది. ఐదు ఎకరాల వరకు పంట భూములు కలిగిన రైతుల రుణాలు మాఫీ చేయాలని సూచించింది.

హైకోర్టు తీర్పుపై అన్నదాతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కూడా కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు. కరువు ఉపశమన ప్యాకేజీ, రుణ మాఫీ డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద 23 రోజులుగా తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళనకారులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు