డోపీగా పట్టుబడ్డ క్రికెటర్‌.. రెండేళ్ల నిషేధం! | Sakshi
Sakshi News home page

డోపీగా పట్టుబడ్డ క్రికెటర్‌.. రెండేళ్ల నిషేధం!

Published Tue, Apr 4 2017 1:22 PM

డోపీగా పట్టుబడ్డ క్రికెటర్‌.. రెండేళ్ల నిషేధం!

వెల్లింగ్టన్‌: నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ అడ్డంగా దొరికిపోయాడు.​ ప్రదర్శన పెంచుకునేందుకు డ్రగ్స్‌ తీసుకున్నఅడమ్‌ కింగ్‌ అనే క్రికెటర్‌ పై రెండేళ్లపాటు నిషేధం విధించారు. అనబోలిక్‌​ స్టెరాయిడ్స్‌, హార్మోన్లు వాడినట్లు డోప్‌ టెస్టుల్లో తేలినందున న్యూజిలాండ్‌ స్పోర్ట్స్‌ ట్రిబ్యూనల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. మిడియం ఫాస్ట్‌ బౌలర్‌ అయిన అడమ్‌ కింగ్‌ పరపరౌము క్రికెట్‌ క్లబ్‌ తరఫున 2011లో అరంగేట్రం చేశాడు.

న్యూజిలాండ్‌ హాకే కప్‌ లో 2013 నుంచి 2016 వరకు ఆడాడు. 2014లో నిషేధిత నాండ్రోలోన్‌, టెస్టోస్టిరాన్‌ ను వాడినట్లు తేలింది. 2015 నుంచి హార్మోన్లు తీసుకుంటున్నట్లు మెడికల​ రెగ్యులేటర్‌ మెడ్‌ సేఫ్‌ వెల్లడించింది. తెలివి తక్కువ చర్యతో అడమ్‌ భారీ మూల్యం చెల్లించుకున్నాడని ఓ ప్రతినిధి గ్రేమ్‌ స్టీల్‌ తెలిపారు.

కివీస్‌ క్రికెటర​ అడమ్‌ కింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘శరీరం దృఢంగా కనిపించేందుకు ఈ పని చేశాను. అధిక బరువు పెరగడంతో సమస్యలు ఎదుర్కున్నాను. మోకాలు సమస్య బాధిస్తోంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేను’ అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు.

Advertisement
Advertisement