మలాలా 'మనసులో మాట'

11 Oct, 2013 16:00 IST|Sakshi
మలాలా 'మనసులో మాట'

పాకిస్థాన్లో బాలికల విద్య కోసం తాలిబాన్ల తుపాకీ గుళ్లకు సైతం ఎదురు నిలిచిన ప్రపంచ వ్యాప్తంగా పలువురి మన్ననలు అందుకున్న మలాలా యూసఫ్ జాయ్ గురువారం తన మనసులోని మాటను బయట పెట్టారు. తనకు పాకిస్థాన్ ప్రధాని పీఠం అధిష్టించాలని ఉందని తెలిపారు. గురువారం న్యూయార్క్లో ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగిస్తూ...పాక్ ప్రధాని అయితే దేశాన్ని రక్షించ వచ్చన్నారు. అలాగే విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించ వచ్చని తెలిపారు. దానితోపాటు విదేశీ వ్యవహారాలపై కేంద్రీకరించ వచ్చని చెప్పారు.

 

గతంలో  పాకిస్థాన్లోని స్వాత్ ప్రాంతంలో మింగొర్కు చెందిన మలాలాతోపాటు పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల బస్సుపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో మలాలా తలకు తీవ్ర గాయమైంది. దాంతో ఆమెను ప్రత్యేక వైద్య చికిత్స కోసం బ్రిటన్ తరలించారు. అక్కడ మలాలా ఆరోగ్యం కుదుటపడింది.

 

మలాలా బ్రిటన్లో ఉంటూ పాకిస్థాన్లో తాలిబన్ల అనుసరిస్తున్న వైఖరితోపాటు బాలికల విద్యపై వారి అవలంభిస్తున్న చర్యలను ప్రచారం ద్వారా ఎండగడుతోంది. మనవ హక్కుల కోసం పోరాడే వారికి  ఐరోపా యూనియన్ పార్లమెంట్ అందించే షకరోవా ప్రతిష్టాత్మక పురస్కారానికి మలాలా గురువారం ఎంపికైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు