బర్త్ డే బాయ్ బిగ్ బికి బాలీవుడ్ శాల్యూట్ | Sakshi
Sakshi News home page

బర్త్ డే బాయ్ బిగ్ బికి బాలీవుడ్ శాల్యూట్

Published Fri, Oct 11 2013 1:02 PM

బర్త్ డే బాయ్ బిగ్ బికి బాలీవుడ్ శాల్యూట్ - Sakshi

సినిమాలకు పనికిరావన్న విమర్శల్ని, అవమానాలను సవాల్గా తీసుకుని నెంబర్వన్ హీరోగా ఎదిగి.. విమర్శకుల నోటే శభాష్ అనిపించుకున్న నటుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. నాలుగు దశాబ్దాలకుపైగా తన అద్భుత నటనతో అభిమానులను అలరిస్తున్న అమితాబ్ శుక్రవారం 71వ పుట్టిన రోజు జరపుకొంటున్నారు.

అభిమానులు, సన్నిహితులు ముద్దుగా 'బిగ్ బి' అని పిలుచుకుంటారు. ఆయన బర్త్ డే సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అమితాబ్ 'కభీ కభీ', 'జంజీర్', 'షోలే', 'అభిమాన్', 'షాహెన్షా', 'బాగ్బన్', 'మొహబ్బతేన్', 'పా' వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆయన చిత్రాలు, పాటలు కొన్నింటిని రీమేక్ కూడా చేశారు. కాగా అమితాబ్ స్థాయిలో యువ హీరోలు విజయాలు అందుకోలేకపోయారు.

భారత క్రికెట్కు సచిన్ టెండూల్కర్ ఎలాగో సినీ పరిశ్రమకు అమితాబ్ అంతటి మహోన్నత వ్యక్తని బాలీవుడ్ ప్రముఖులు అభివర్ణించారు. అమితాబ్ భార్య జయాబచ్చన్ కూడా నిన్నటి తరం హీరోయిన్ కాగా కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. బిగ్ బి ఏడుపదుల వయసులోనూ కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆయన ఇన్నింగ్స్ ఎన్నటికీ ముగియదని అభిమానులు అంటున్నారు.

Advertisement
Advertisement