-

టెన్నిస్ బ్యూటీ ఆశలపై నీళ్లు

11 Jul, 2016 16:13 IST|Sakshi
టెన్నిస్ బ్యూటీ ఆశలపై నీళ్లు

రష్యా టెన్నిస్ బ్యూటీ, ఆరు అడుగుల పొడగరి మారియా షరపోవా ఆశలు అడియాసలు అయ్యాయి. రియో ఒలింపిక్స్ లో తన దేశం తరఫున ఆడాలనుకున్న ఈ సుందరిలో తాజా ఉత్తర్వులు నిరాశా నింపాయి. డోపింగ్ పరీక్షల్లో అడ్డంగా దొరికిపోయి టెన్నిస్ కు దూరమైన షరపోవా తాజాగా చేసుకున్న అప్పీలుపై క్రీడా వివాదాల పరిష్కార కోర్టు తన తీర్పును సెప్టెంబర్ వరకు వాయిదా వేసింది. దీంతో రియో ఒలింపిక్స్ లో షరపోవా ఆడే చాన్స్ పూర్తిగా లేనట్టే.

డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన షరపోవా రెండేళ్లు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తనపై అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ ఆమె కోర్టుకు వెళ్లింది. ఈ అప్పీలుపై సోమవారం తీర్పు వెలువడాల్సి ఉండగా.. తీర్పు వాయిదాకు షరపోవా, ఐటీఎఫ్ అంగీకరించాయని, దీంతో తుది ఉత్తర్వులను సెప్టెంబర్ లో వెలువరిస్తామని న్యాయస్థానం తెలిపింది.

మరిన్ని వార్తలు