క్షిపణితో విమానాన్ని కూల్చేశారు..

13 Oct, 2015 18:05 IST|Sakshi
క్షిపణితో విమానాన్ని కూల్చేశారు..

కౌలాలంపూర్: గతేడాది ఉక్రెయిన్లో కూలిన మలేసియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 17  ప్రమాదం వెనుక నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగు చూశాయి. రష్యాలో తయారైన క్షిపణితో దాడి చేయడం వల్ల ఈ విమానం కూలిపోయిందని నెదర్లాండ్స్ సేఫ్టీ బోర్డు తన నివేదికలో వెల్లడించింది. 9ఎమ్38 క్షిపణి.. మలేసియా విమానం ముందు భాగాన్ని కొట్టడంతో విమానం పేలిపోయిందని తుది నివేదికలో పేర్కొంది.

రష్యా ప్రభుత్వం మద్దతిస్తున్న తిరుగుబాటు దారులు ఈ విమానాన్ని కూల్చివేశారని ఉక్రెయిన్ ఆరోపిస్తుండగా.. ఉక్రెయిన్ నియంత్రణలో ప్రాంతంలో నుంచి క్షిపణిని ప్రయోగించారని రష్యా చెబుతోంది. కాగా క్షిపణితో విమానంపైకి దాడి చేసింది ఎవరన్న విషయాన్ని డచ్ సేఫ్టీ బోర్డు నివేదికలో పేర్కొనలేదు. ఉక్రెయిన్లో ప్రభుత్వ దళాలకు, రష్యా అనుకూల తిరుగుబాటు దారులకు మధ్య పోరు జరుగుతోంది.

గతేడాది జూలైలో జరిగిన ఈ విమాన ప్రమాదంలో 298 మంది మరణించారు. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్కు వెళ్తుండగా తూర్పు ఉక్రెయిన్లో కూలిపోయింది.

మరిన్ని వార్తలు