దద్దరిల్లుతున్న దక్షిణ గాజా | Sakshi
Sakshi News home page

దద్దరిల్లుతున్న దక్షిణ గాజా

Published Sun, Oct 22 2023 5:22 AM

Israel-Gaza war: Israel Plans to Increase Strikes on Gaza - Sakshi

జెరూసలేం: ఇజ్రాయెల్‌ దాడులతో దక్షిణ గాజా గజగజలాడుతోంది. ఉత్తర గాజాను ఖాళీ చేసి తక్షణం దక్షిణాదికి వెళ్లాల్సిందిగా 11 లక్షల మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ హెచ్చరించడం తెలిసిందే. దాంతో అంత మందీ నానా పాట్లు పడి అతి ప్రమాదకరమైన 20 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి దక్షిణ గాజాకు చేరుకున్నారు. ఇంతా చేసినా రోజుల వ్యవధిలోనే దక్షిణ గాజాపైనా ఇజ్రాయెల్‌ తీవ్ర దాడులకు తెగబడడటంతో పాలస్తీనియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.

అక్కడి ఖాన్‌ యూనిస్‌ నగరంతో పాటు పలు ప్రాంతాలపై ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్‌ క్షిపణులు వచ్చి పడుతున్నట్టు స్థానికులు వాపోతున్నారు. దాడుల్లో ఇప్పటికే కనీసం 4,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. 13 వేల మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు వివరించింది. ఇజ్రాయెల్‌లో ఇప్పటిదాకా 1,500 మంది మరణించినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు గాజాపై భూతల దాడికి అన్ని విధాలా ఇజ్రాయెల్‌ సిద్ధమవుతోంది.

లెబనాన్‌ వైపు సరిహద్దుల్లో ఉన్న పెద్ద పట్టణాలను ఆగమేఘాల మీద ఖాళీ చేయిస్తోంది. ఈ నేపథ్యంలో లెబనాన్‌ ముందుజాగ్రత్త చర్యగా సరిహద్దుల వెంబడి తన నగరాలు, ఆవాసాలను ఖాళీ చేయిస్తోంది. హమాస్‌కు నేరుగా దన్నుగా బరిలో దిగాలని లెబనీస్‌ ఉగ్ర సంస్థ హెజ్బొల్లా నిర్ణయం తీసుకుందని ఇజ్రాయెల్‌ తాజాగా ఆరోపించింది. ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.

హెజ్బొల్లా ఇప్పటికే దక్షిణ లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌పై ఎడతెరిపి లేకుండా క్షిపణి దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ ఏడో తేదీన మెరుపుదాడికి దిగిన సందర్భంగా బందీలుగా పట్టుకున్న వందలాది మందిలో ఇద్దరు అమెరికన్లను హమాస్‌ తాజాగా విడుదల చేసింది. జుడిత్‌ రానన్, ఆమె 17 ఏళ్ల కూతురు నటాలీ హమాస్‌ చెర నుంచి బయటపడ్డట్టు ఇజ్రాయెల్‌ పేర్కొంది.

కీలక భేటీ
యుద్ధాన్ని ఆపే మార్గాంతరాలపై డజనుకు పైగా ప్రాంతీయ, పాశ్చాత్య దేశాలకు అధినేతలు, నేతలు, ఉన్నతాధికారులతో ఈజిప్ట్‌ శనివారం సమావేశం నిర్వహించింది. యుద్ధానికి తెర వేయడం, వీలుకాని పక్షంలో కనీసం కాల్పుల విరమణకైనా ఇరు వర్గాలను ఒప్పించే మార్గాంతరాలపై నేతలు చర్చించారు.

ఇందులో ఇటలీ, పెయిన్, గ్రీస్, కెనడా ప్రధాన మంత్రులతో పాటు యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు పాల్గొన్నట్టు ఈజిప్ట్‌ ప్రభుత్వం పేర్కొంది. ఖతర్, యూఏఈ తదితర దేశాల ఉన్నత స్థాయి నేతలు కూడా పాల్గొన్నారు. మరోవైపు, ఇరాక్‌ నుంచి తక్షణం అమెరికా బలగాలు పూర్తిగా వైదొలగాలని ఇరాన్‌ దన్నున్న స్థానిక మిలిటెంట్‌ సంస్థలు హెచ్చరించాయి.

థన్‌బర్గ్‌ ట్వీట్‌కు దీటుగా బదులిచి్చన ఇజ్రాయెల్‌
పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌ చేసిన ట్వీ ట్‌కు ఇజ్రాయెల్‌ గట్టి సమాధానం ఇచి్చంది. యు ద్ధంపై పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌ చేసిన ట్వీట్‌కు ఇజ్రాయెల్‌ దీటుగా బదులిచి్చంది. గాజాకు మద్దతుగా కొందరు వ్యక్తులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తోన్న చిత్రాన్ని థన్‌బర్గ్‌ ట్వీట్‌చేశారు. ‘పాలస్తీనా, గాజాకు మద్దతిస్తున్నాం.

పోరుపై ప్రప ంచం స్పందించాలి. పాలస్తీనా ప్రజలు, ఇతర బాధితుల కోసం కాల్పుల విరమణ ప్రకటించాలి. న్యా యం, స్వేచ్ఛ కోసం పిలుపు ఇవ్వాలి’ అని గ్రేటా ట్వీట్‌చేశారు. దీనిపై ఇజ్రాయెల్‌ స్పందించింది. ‘హమాస్‌ దాడుల వల్ల ఎంతోమంది అమాయకులై న ఇజ్రాయెల్‌ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ నరమేధ బాధితుల్లో మీ స్నేహితులూ ఉండొచ్చు. వారి కోసం పోరాడండి’ అని వ్యాఖ్యానించింది.  

Advertisement
Advertisement