ట్రంప్ షాక్ వెనక్కి: భారీ లాభాల్లో మార్కెట్లు

10 Nov, 2016 10:23 IST|Sakshi
ట్రంప్ ఎఫెక్ట్తో బుధవారం ట్రేడింగ్లో అతలాకుతలైన దేశీయ మార్కెట్లు సర్దుకొని గురువారం సెషన్ ప్రారంభంలో భారీ లాభాలలో ప్రారంభమయ్యాయి. ప్రపంచమార్కెట్ల వేగవంతం దేశీయ సూచీలకు బాగా కలిసివచ్చింది. దీంతో సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం 376.32 పాయింట్ల లాభంతో 27,628 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 122.85 పాయింట్ల లాభంతో 8,554గా ట్రేడ్ అవుతోంది. సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంకు టాప్ గెయినర్స్గా లాభాలు పండిస్తున్నాయి. ప్రారంభంలో ఇన్ఫోసిస్, ఐటీసీ, లుపిన్ షేర్లు నష్టపోయాయి. 
 
అటు ట్రంప్ టోర్నడో నుంచి ఆసియన్ మార్కెట్లు కోలుకున్నాయి. అమెరికా అ‍ధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయ కెరటం ఎగురవేయడంతో, ఎన్నికల సందిగ్థత నుంచి గ్లోబల్ మార్కెట్లు తేరుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర 30 రూపాయల నష్టంతో 29,850గా కొనసాగుతోంది. కానీ డాలర్తో రూపాయి మారకం విలువ 28 పైసలు బలపడి 66.34గా ఉంది. 
>
మరిన్ని వార్తలు