పజ్జూరులో త్వరలో తవ్వకాలు

22 Jan, 2016 02:18 IST|Sakshi
పజ్జూరులో త్వరలో తవ్వకాలు

పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ బ్రహ్మచారి
తిప్పర్తి: నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామ శివారు పరిధి పాటివారి స్థలంలో తొలి చారిత్రక యుగం నాటి ఆనవాళ్లు లభించాయని, త్వరలో తవ్వకాలు చేపట్టనున్నామని పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ బ్రహ్మచారి తెలిపారు. గురువారం ఆయన పజ్జూరులో పాటివారి స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. తవ్వకాలకు సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి వచ్చిందని, రైతులు, గ్రామస్తుల సహకారంతో నాటి ఆధారాలను వెలికితీయనున్నట్లు తెలిపారు.

ఒకటి, రెండో యుగం కాలం నాటి ఆనవాళ్లు లభించడంతోపాటు 10, 12వ యుగం నాటి ఆలయం కూడా ఇదే గ్రామంలో ఉందని, ఈ తవ్వకాలతో మధ్యకాలంలో ఉన్న చరిత్ర, ఆధారాలు బయటపడే అవకాశముందని చెప్పారు. ఆయన వెంట పురావస్తుశాఖ అధికారులు నాగరాజు, భానుమూర్తి, తదితరులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు