పార్లమెంట్కు వస్తానంటున్న మాజీ అధ్యక్షుడు

28 Dec, 2016 09:35 IST|Sakshi
పార్లమెంట్కు వస్తానంటున్న మాజీ అధ్యక్షుడు
కరాచీ : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, బెనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ ఆలీ జర్దారీ పార్లమెంట్కు రానున్నట్టు  తెలిపారు. కొడుకు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్, తాను కలిసి ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు పోటీచేయనున్నామని ప్రకటించారు. ప్రధాని బెనజీర్ భుట్టో 9వ వర్థంతిని పురస్కరించిన పీపీపీ మద్దతుదారులతో జరిపిన సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. షరీఫ్ ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని, అవినీతి మయంలో కూరుకుపోయిందని ఘాటైన విమర్శలు చేశారు. జర్దారీ,  పాకిస్తాన్ పీపుల్ పార్టీ(పీపీపీ)కి  కో-చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
 
8 నెలల పాటు స్వీయ బహిష్కరణలో ఉన్న ఈయన, నవాబ్షా నుంచి పోటీచేయనున్నానని, బిలావల్ సింధ్ ప్రావినెన్స్ నుంచి బరిలోకి దిగనున్నారని చెప్పారు. ఈ ప్రకటన దేశ రాజకీయాల్లో ఓ పెద్ద మార్పును తీసుకురానుందని చెప్పారు.  ఈ ప్రకటన చేయబోయే ముందు తాను ప్రజలతో పంచుకుంటునాన్న గుడ్న్యూస్ను చెబుతున్నాను. తాను, బిలావల్ ప్రస్తుత పార్లమెంట్కు పోటీచేయబోతున్నాం అని తెలిపారు. జర్దారీ తన చెల్లి అజ్రా పెచువ్సో సీటుపై, బిలావల్ సూమ్రో షాహిబ్ సీట్లో పోటీచేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికల ద్వారా జర్దార్ పార్లమెంట్లోకి వెళ్లబోతున్నారని డాన్ రిపోర్టు చేసింది.. ఈ పరిస్థితిలో ఆ నియోజకవర్గాలకు తాజా ఎన్నికలు నిర్వర్తించబోతున్నారని తెలిపింది. 
>
మరిన్ని వార్తలు