పాకిస్తాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘన

12 Aug, 2013 10:19 IST|Sakshi

శ్రీనగర్ : పాకిస్తాన్ బలగాలు మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డాయి. అయిదుగురు భారతీయ జవాన్ల ఊచకోతపై సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాలు సోమవారం తెల్లవారుజామున మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. జమ్మూ, కాశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారతీయ సైనిక స్థావరాలపై భారతీయ సైనికులే లక్ష్యంగా పాక్ మళ్లీ కాల్పులు జరిపింది.

అయితే కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పి కొట్టిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాక్ సైనికులు పెద్దఎత్తున ప్రాణనష్టం కలిగించడం కోసం పలు భారతీయ సైనిక స్థావరాలపై భారీ ఆయుధాలతోను కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. పాక్ సైన్యాలు నిన్నటి నుంచి ఇప్పటివరకూ మూడుసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డాయి.

మరిన్ని వార్తలు