రూ. 300 టికెట్‌పై ఫొటో రద్దు

31 Dec, 2015 03:22 IST|Sakshi

సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం ఆన్‌లైన్ పద్ధతిలో కేటాయించే రూ.300 టికెట్లను ఫొటో లేకుండా  కేవలం గుర్తింపు కార్డు నంబర్ ఆధారంగా జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ విధానం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం రోజూ దాదాపు 30 వేల మందికి రూ.300 టికెట్లు కేటాయిస్తున్నారు. ఇందుకోసం సంబంధిత భక్తుడు తన ఫొటోను ఆన్‌లైన్ పద్ధతిలో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. దీనివల్ల సామాన్య భక్తులు టికెట్లు పొందలేకపోతున్నారని గుర్తించిన టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఫొటో విధానాన్ని రద్దు చేయాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు