స్టెంట్ల ధరలు తగ్గడంతో 4450 కోట్లు ఆదా

15 Mar, 2017 09:31 IST|Sakshi

న్యూఢిల్లీ: స్టెంట్ల ధరలు తగ్గించడం వల్ల దేశవ్యాప్తంగా హృద్రోగులకు మొత్తం రూ.4,450 కోట్లు ఆదా చేశామని కేంద్ర రసాయన, ఎరువుల సహాయ మంత్రి మన్‌సుఖ్‌ మండావియా లోక్‌సభకు తెలిపారు. ఎన్‌పీపీఏ గత నెల 12న వీటి ధరల నియంత్రిస్తూ నోటీసు ఇచ్చినప్పటి నుంచీ ఈ మొత్తం ఆదా అయిందన్నారు.

భారీగా ఉన్న స్టెంట్ల ధరలపై ఎన్‌పీపీఏ ఇటీవల నియంత్రణ విధించింది. దీని ప్రకారం బేర్‌ మెటల్‌ స్టెంట్‌ (బీఎంఎస్‌) ధర రూ.7,260, డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్ల (డీఈఎస్‌), మెటాలిక్‌ డీఈఎస్, వస్కులర్‌ స్కాఫోల్డ్‌ (బీవీఎస్‌) బయోడీగ్రేడబుల్‌ స్టెంట్ల ధరలను రూ.29,600గా నిర్ణయించింది.

మరిన్ని వార్తలు