రిజర్వేషన్ల జోలికొస్తే ఊరుకోం

21 Jan, 2017 16:54 IST|Sakshi
రిజర్వేషన్ల జోలికొస్తే ఊరుకోం
  • బీజేపీకి మాయావతి ఘాటు హెచ్చరిక

  • లక్నో: రిజర్వేషన్ల జోలికి వస్తే బీజేపీకి దళితులు తగిన బుద్ధి చెప్తారని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ మాయవతి హెచ్చరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) పబ్లిసిటీ చీఫ్‌ మన్మోహన్‌ వైద్య శుక్రవారం జైపూర్‌ సాహితి ఉత్సవాల్లో  రిజర్వేషన్లను కొనసాగింపుపై ఆలోచించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మన్మోహన్‌ వైద్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

    ఈ నేపథ్యంలో మాయవతి స్పందిస్తూ... కొంతమంది దొంగలు రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాయాలని చూస్తున్నారు. ఏ ప్రభుత్వామైనా రిజర్వేషన్లను నిలిపివేయాలని చూస్తే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆమె అన్నారు. శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో  ఆమె మాట్లాడుతూ... రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ హక్కును ఎవరూ హరించలేరని  పేర్కోన్నారు. కాషాయ పార్టీ కులాల విషయంలో ద్వంద్వ వైఖరిని మానుకోవాలని సూచించారు. అంబేద్కర్‌ను దళితులు, ఆదివాసీ, వెనకబడిన తరగతులకు ‘మెసయ్య’గా ఆమె అభివర్ణించారు.
     

మరిన్ని వార్తలు