ట్రంప్ టవర్స్ సీక్రెట్ ల్యాప్టాప్ చోరి

19 Mar, 2017 08:24 IST|Sakshi
ట్రంప్ టవర్స్ సీక్రెట్ ల్యాప్టాప్ చోరి
న్యూయార్క్: ట్రంప్ టవర్ కు సంబంధించిన ఎంతో కీలకమైన సమాచారమున్న సీక్రెట్ సర్విస్ ల్యాప్టాప్ దొంగతనానికి గురైంది. సీక్రెట్ సర్విస్ ఏజెంట్స్ కారు నుంచి బ్రూక్లిన్ లో దీని చోరి జరిగింది. ఈ ల్యాప్ టాప్ లో ట్రంప్ టవర్ కు సంబంధించిన ఫ్లోర్ ప్లాన్స్ తో పాటు ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించిన హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ మెయిల్స్ వాడకానికి చెందిన క్రిమిషనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు కూడా ఉన్నాయని మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. దేశ భద్రతకు సంబంధించిన వివరాలు దానిలో ఉన్నాయని గార్డియన్ రిపోర్టు చేసింది.
 
గురువారం ఉదయం ఏజెంట్ వాహనం నుంచి ఈ ల్యాప్ టాప్ దొంగతనానికి గురైంది. అప్పటినుంచి అధికారులు దీని వెతుకులాటలో నిమగ్నమై ఉన్నారు. కానీ ఇప్పటి వరకు దాని ఆచూకీ లభ్యం కాలేదు. ల్యాప్ టాప్ తో పాటు మరికొన్ని వస్తువులను కూడా దొంగలు తస్కరించారు. కాయిన్స్, బ్లాక్ బ్యాగ్ వంటిని వారు తీసుకెళ్లారు. కానీ అవి రికవరీ అయినట్టు తెలిసింది. పోప్ ఫ్రాన్సిస్ కు చెందిన పలు ముఖ్యమైన డాక్యుమెంట్లు దానిలో ఉన్నాయి. అయితే కట్టుదిట్టమైన భద్రతతో ఈ ల్యాప్ టాప్ ను సీక్రెట్ సర్వీసు జారీచేస్తోంది. ఫుల్ డిస్క్ ఎన్స్క్రిప్షన్ ఇది కలిగి ఉంటుందని సీక్రెట్ సర్వీసు అధికార ప్రతినిధి కేథి మిల్హోన్ తెలిపారు.   
మరిన్ని వార్తలు