నిలువునా పతనమైన స్టాక్ మార్కెట్

6 May, 2015 16:47 IST|Sakshi
నిలువునా పతనమైన స్టాక్ మార్కెట్

ముంబై: స్టాక్ మార్కెట్ బుధవారం నిలువునా పతనమైంది. అమ్మకాల ఒత్తిడితో సూచీలు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 723 పాయింట్లు పతనమైంది. చివరకు 26,717 పాయింట్ల ఆగింది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 223 పాయింట్లు నష్టపోయి 8,097 వద్ద ముగిసింది. జనవరి 6 తర్వాత సెన్సెక్స్ ఇంత భారీ స్థాయిలో నష్టపోవడం ఇదే ప్రథమం.

హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడడంతో అతడికి సంబంధమున్న కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్ నేషనల్ మీడియా, మంధనా ఇండస్ట్రీస్ లిమిటెడ్  షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. ఈ రెండు షేర్లు బీఎస్ఈలో దాదాపు  5 శాతం వరకు నష్టపోయాయి.

మరిన్ని వార్తలు