వాట్సాప్ను ఆయన ఆలా వాడుకున్నారన్నమాట! | Sakshi
Sakshi News home page

వాట్సాప్ను ఆయన ఆలా వాడుకున్నారన్నమాట!

Published Wed, May 6 2015 6:11 PM

వాట్సాప్ను  ఆయన ఆలా వాడుకున్నారన్నమాట!

కాన్పూర్:   సీనియర్ పోలీసు  అధికారులు వేధిస్తున్నారని  ఆరోపిస్తూ  ఒక ఎస్సై తన రాజీనామా పత్రాన్ని వాట్సాప్లో  పంపించడంతో  సదరు  పోలీసు ఉన్నతాధికారులు తలలు పట్టుకు కూచున్నారట.  జనరల్గా ఫిర్యాదులు స్వీకరించడానికి, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి  హెల్ప్లైన్ నెంబర్లు పనిచేస్తాయి.  ఈ నేపథ్యంలో  వివిధ సేవా రంగాల్లో తమ సేవలను వినియోగదారులకు అందించడానికి  చాలా సంస్థలు హెల్స్ లైన్లను  ఏర్పాటు చేశాయి.  దీంట్లో భాగంలో ఉత్తరప్రదేశ్లోని  ఇటావా, కాన్పూర్, కన్నూజ్, ఝాన్సీ  తదితర తొమ్మిది జిల్లాలకు సంబంధించి  పోలీస్ హెల్స్ లైన్ నెంబర్. నెం.176 తో ఒక వాట్సాప్ ఖాతాను గత ఏప్రిల్లో ప్రారంభించారు.  వీడియో, ఆడియో, టెక్ట్స్ మెసేజ్ ను  దీని ద్వారా పోలీసులకు చేరవేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.  ఇపుడు  ఎస్సై రాజీనామాతో పోలీసులు  ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డారు. 

వివరాల్లోకి వెళితే   తనపై ఆఫీసర్లు  తనను అవమానిస్తూ, వేధిస్తున్నారని  ఆరోపిస్తూ  రసూల్బాద్  పోలీస్ స్టేషన్ ఎస్సై వినోద్ కుమార్  వాట్సాప్ లో రిజైన్ లెటర్ను  పంపించారు .  దీంతో దీనిపై  విచారణ జరిపి  చర్యలు తీసుకోవాలో 24 గంటల్లోగా   తెలియజేయాలని  ఆదేశాలు జారీ అయ్యాయని ఎస్పీ అశుతోష్ పాండే  తెలిపారు. ఇలా వాట్సాప్ ద్వారా ఒక ఉద్యోగి రాజీనామా లేఖను పంపడం ఇదే మొదటి సారని ఆయనన్నారు. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసు బాసే బాధితుడుగా మారి అందుబాటులో ఉన్న వాట్పాప్ ను భలే వాడుకున్నాడుగా అనుకున్నారట కొంతమంది
 

Advertisement
Advertisement