లాభాల్లో మార్కెట్లు: ఐటీ , ఫార్మా డీలా

24 Apr, 2017 09:39 IST|Sakshi

ముంబై: దేశీయ  సోమవారం  స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభంమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల  పరిస్థితులున్నప్పటికీ పాజిటివ్‌ నోట్‌తో మొదలైన తర్వాత మార్కెట్లు మరింత  పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 115 పాయింట్ల లాభంతో 29, 480 వద్ద,నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 9153 వద్ద  కొనసాగుతున్నాయి.   ప్రధానంగా రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌ , ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్లు లాభాల్లో,  ఫార్మా నష్టాల్లో ఉన్నాయి.

అయితే ఐటీ  రంగానికి  అమెరికా ట్రంప్‌ ఆరోపణల దెబ్బ భారీగా తాకింది. ముఖ్యంగా దిగ్గజ కంపెనీలు ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్లు సహా,ఇతర కంపెనీలు భారీగా నష్టాపోతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు  తన హవాను కొనసాగిస్తోంది.  ఇటీవల ఆల్‌టైం ను హైని తాకిన బ్యాంకు  షేరు సోమవారం ఆరంభంలోనే 2 శాతానికిపైగా లాభపడింది.  ఏసీసీ లాప్‌ విన్నర్‌గా  ఉంది.  ఎల్‌ అండ్‌ టి ఐబీ హౌసింగ్‌, గ్రాసిమ్‌, అంబుజా  ఆర్‌ఐఎల్‌ లాభాల్లోను,  జీ, లుపిన్‌, హెచ్‌యూఎల్‌, సిప్లా,  యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరికల నేపథ్యంలో  దివీస్‌ నష్టాల్లోనూ ట్రేడ్‌ అవుతున్నాయి.  

అటు అటు డాలర్‌ మారకంలో రూపాయి బలంగా మొదలైంది. 0.05 పైసల లాభంతో రూ.64.51 వద్ద ఉంది.  గురువారం నాటి 64.61 ముగింపుతో పోలిస్తే పాజిటివ్‌గా ప్రారంభమైంది. అయితేపసిడి ధరలు మాత్రం బలహీనంగా ఉన్నాయి.

 

మరిన్ని వార్తలు