'మీ మధ్య ఉన్నందుకు గర్వపడుతున్నా'

1 Sep, 2014 09:34 IST|Sakshi
'మీ మధ్య ఉన్నందుకు గర్వపడుతున్నా'

టోక్యో: విశ్వమానవ కళ్యాణానికి జపాన్ అందించిన సాయం ఎనలేనిదని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పరిశోధన రంగంలో జపాన్ తో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. జపాన్ పర్యటనలో భాగంగా మూడో రోజు ఆయన పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ ఆర్థికగతిని మార్చిన పారిశ్రామికవేత్తల మధ్య ఉన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు.

ప్రభుత్వం, పెట్టుబడిదారుల మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా జపాన్ పారిశ్రామివేత్తలతో కలిసిన పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. సుపరిపాలన తమ ధ్యేయమన్నారు. పాలనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వేగవంతం చేస్తామని  మోడీ చెప్పారు. తమ దేశంలో జపాన్ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు.

మరిన్ని వార్తలు