స్పైస్ జెట్.. స్పైసీ సేల్

21 Nov, 2016 11:37 IST|Sakshi
స్పైస్ జెట్.. స్పైసీ సేల్

ముంబై:  బడ్జెట్ జెట్ ఎయిర్ వేస్ స్పైస్ జెట్  స్పైసీ యాన్యూల్ సేల్ ను ప్రకటించింది.  రూ.737ల నుంచి ప్రారంభమయ్యే నాలుగు రోజుల అమ్మకాలను  సోమవారం  ప్రారంభించింది.  రూ.737 (అన్నిచార్జీలు కలిసి)తగ్గింపు ధరలను  దేశీయ ప్రయాణాలపై అనుమతించనుంది.  ఈ రోజు మొదలయ్యే ఆఫర్  నవంబర్ 24 అర్ధరాత్రి వరకూ అందుబాటులోఉంటుందని  స్పైస్ జెట్  వెల్లడించింది.   ఈ ఆఫర్ లో బుక్ చేసుకున్న టికెట్లతో జనవరి9 -అక్టోబర్ 28 , 2017  మధ్య ప్రయాణించవచ్చని తెలిపింది. 2017 స్పైస్జెట్ రూ మొదలు ఛార్జీల చెప్పారు. చెన్నై- కోయంబత్తూర్-  చెన్నై, జమ్ము- శ్రీనగర్ - జమ్మూ, చండీగఢ్ - శ్రీనగర్ - చండీగఢ్, అగర్తలా - గౌహతి ల మధ్య దాదాపు 500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుందని తెలిపింది.

ఈ ఆఫర్ కింద కొనుగోలుచేసిన టిక్కెట్లు రద్దు చేస్తే మాత్రమే చట్టబద్ధమైన పన్నులు చెల్లించమని స్పష్టం చేసింది.   అలాగే  పాత రూ. 500, రూ. 1,000 కరెన్సీ కి నవంబర్ 24 అర్ధరాత్రి వరకూ తమ విమానాశ్రయం కౌంటర్లవద్ద అనుమతి ఉన్నట్టు   తెలిపింది.  ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనేది స్పష్టం చేయలేదు. ఫస్ట్  కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు