సుబ్రతారాయ్ కి మరోసారి ఊరట

3 Aug, 2016 20:38 IST|Sakshi
సుబ్రతారాయ్ కి మరోసారి ఊరట
న్యూఢిల్లీ: సహారా  అధినేత సుబ్రతారాయ్‌కు  మరోసారి ఊరట లభించింది. ఆయనకు గతంలో మంజూరు చేసిన పెరోల్ గడువును సెప్టెంబర్ 16 వరకు  పొడిగిస్తూ సుప్రీంకోర్టు  బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు జైలు నుంచి విముక్తి లభించాలంటే రూ.300కోట్లు  చెల్లించాలని పేర్కొంది. గతంలో ఆగస్ట్ 3వ తేదీ వరకు వాయిదా వేసిన ఈ కేసును విచారించిన సుప్రీం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.  
 
 కాగా ఇటీవల ఆయన తల్లి మరణంతో మానవీయ కోణంలో సుబ్రతారాయ్‌కు సుప్రీంకోర్టు ఈ ఏడాది మే నెలలో జైలు నుంచి తాత్కాలిక విముక్తి కల్పించింది. రూ. 500 కోట్ల రూపాయలు చెల్లిస్తానన్న సుబ్రతా  200.కోట్లు మాత్రమే చెల్లించడంతో మిగిలిన రూ. 300 కోట్లను త్వరలో చెల్లించాలని జస్టిస్ ఠాకూర్ , జస్టిస్ ఏకే సిక్రి, లతో కూడిన బెంచ్ ఆదేశించింది.  సెప్టెంబర్ 15లోపు చెల్లించాలని లేదంటే జైలు కెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ కేసులో రూ.200 కోట్లను మాత్రమే డిపాజిట్ చేసిన సుబ్రతా మిగిలిన  రూ.300 కోట్లను డిపాజిట్ చేసేందుకు ఈ ఏడాది చివరి వరకు గడువివ్వాలని సుబ్రతారాయ్  అభ్యర్థించిన సంగతి తెలిసిందే. 
 
మరిన్ని వార్తలు