గ్రేట్ సేల్.. 14 లక్షలకు ఎనిమిది కార్లు

23 Jul, 2016 14:48 IST|Sakshi
గ్రేట్ సేల్.. 14 లక్షలకు ఎనిమిది కార్లు

ముంబై: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా దేశం విడిచిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన ఎనిమిది కార్లను ఎస్ బీఐ క్యాప్  ట్రస్టీ కంపెనీ లిమిటెడ్  వేలానికి పెట్టింది. మాల్యాకు చెందిన  ఎనిమిదికార్లను  సుమారు 14 లక్షలకు వేలం వేయనుంది.   వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు 2014  మార్చి నాటికి  కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ    రూ. 6.963 కోట్ల   బకాయి పడింది. ఈ రుణాల వసూలులో భాగంగా  రూ 13.70 లక్షల  లక్ష్యంతో ఈ వేలం జరగనుంది. ఆదాయం పన్ను, సేవా పన్ను శాఖ సహకారంతో ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్  ఆగస్టు 25 న ఈ వేలం నిర్వహిస్తోంది.  

ప్రస్తుతం కింగ్ఫిషర్ హౌస్  బ్యాక్ యార్డ్ లో పార్క్ చేసి వున్న ఈ కార్ల వేలంలో పాల్గొనడానికి  ప్రతి వాహనానికి కోట్ చేసిన ధరలో  10 శాతం ధరను డిపాజిట్  చేయాల్సి ఉంటుంది.  ఆగస్టు 23 తో ముగియనున్న రిజస్ట్రేషన్ కోసం  రూ. 2,000 చెల్లించాలి. అలాగే ఈ కార్లు తనిఖీ చేయాలనుకుంటే  జూలై 29నుంచి ఆగస్టు 5  వరకు అవకాశం.

కాగా ఎస్‌బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియం.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ కి ఇచ్చిన దాదాపు రూ. 6,963 కోట్లు పైగా రుణాలను రాబట్టుకునేందుకు అవస్థలు పడుతోంది. ఈ నేపథ్కంలోనేకింగ్ ఫిషన్ హౌస్   విలువను  రూ.150 కోట్ల నుంచి  రూ.135 కోట్లకు తగ్గించి అమ్మకానికి పెట్టినా  కొనే నాధుడు లేక ఇబ్బందులు  పడుతున్నసంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు